Telangana Govt: విద్యార్థులకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్రీకృత వంటశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్రీకృత వంటశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు అల్పాహారం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కొడంగల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆపై ప్రతి జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు.
హరే కృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం అందించే పైలట్ ప్రాజెక్ట్ పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమీక్షించారు.
కోడాన్లో సెంట్రలైజ్డ్ కిచెన్‌ను నిర్మించగానే ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. సీఎస్ఆర్ ఫండ్‌తో పాటు హరే కృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఈ విషయంపై సమగ్ర అధ్యయనం జరగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
ఇందుకోసం వివిధ కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధిని వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ సంపద పరిరక్షణను ప్రజా ప్రభుత్వం బాధ్యతగా భావించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు పునరుద్ధరణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.